EPFO-EPS: ‘ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వేతన పరిమితిని రెట్టింపు చేయండి’

ఈపీఎస్‌, ఈఎస్‌ఐ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఎంఎస్‌ కోరింది.

Published : 11 Jul 2024 00:22 IST

EPFO-EPS | దిల్లీ: ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అందిస్తున్న సామాజిక భద్రతా పథకాల వేతన పరిమితిని రెట్టింపు చేయాలని ఆరెస్సెస్‌ అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (BMS) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ పరిధిలోని ఎంప్లాయీ పెన్షన్‌ స్కీమ్‌, 1995 వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. అలాగే, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఈఎస్‌ఐ వేతన పరిమితి రూ.21 వేలుగా ఉంది. వేతనాలు, ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని, వీటిని పెంచాలని బీఎఎంస్‌ కోరింది.

ఈ మేరకు బీఎంఎస్‌ అధ్యక్షుడు హిరణ్మయ్‌ పాండ్య, ప్రధాన కార్యదర్శి రవీంద్ర హిమ్తే నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను కలిసింది. ఈపీఎఫ్‌, ఈపీఎస్‌ వేతన పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందించారు. తమ అభ్యర్థనకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని బీఎంఎస్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ మొత్తం పెంచడం వల్ల పెద్ద సంఖ్యలో కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. వేతనాలు, సామాజిక భద్రతకు సంబంధించి గతంలో  తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని