Avalanche: ఏడుగురు సైనికుల గల్లంతు విషాదాంతం.. అందరూ మృతి

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్‌ సెక్టార్‌లో సంభవించిన ఆకస్మిక హిమపాతంలో ఏడుగురు సైనికులు గల్లంతయిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో ఏడుగురూ మృతి చెందినట్లు సైన్యం మంగళవారం వెల్లడించింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు...

Updated : 08 Feb 2022 18:50 IST

వెల్లడించిన ఆర్మీ అధికారులు

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్‌ సెక్టార్‌లో సంభవించిన ఆకస్మిక హిమపాతంలో ఏడుగురు సైనికులు గల్లంతయిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో ఏడుగురూ మృతి చెందినట్లు సైనిక ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 19వ జమ్మూ- కశ్మీర్‌ రైఫిల్స్‌ దళానికి చెందిన చెందిన ఏడుగురు సైనికులు పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న క్రమంలో హిమపాతంలో చిక్కుకుపోయారని సైన్యం సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఎత్తయిన ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది, నిపుణుల బృందం.. వారి ఆచూకీ కోసం ముమ్మర సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నేడు వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో మృతదేహాలు లభ్యమైనట్లు రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ హర్షవర్ధన్ పాండే వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్లు మన భద్రత కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్నారు.. వారికి సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని