Biden pays Tribute: అమరవీరులకు అగ్రరాజ్యం నివాళి.. భావోద్వేగానికి గురైన అధ్యక్షుడు

కాబుల్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 13 మంది అమెరికా సైనికులకు అగ్రరాజ్యం అశ్రునివాళులు అర్పించింది.....

Published : 30 Aug 2021 22:36 IST

వాషింగ్టన్‌: కాబుల్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 13 మంది అమెరికా సైనికులకు అగ్రరాజ్యం అశ్రునివాళులు అర్పించింది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా చేరుకున్న సైనికుల భౌతిక కాయాలకు అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్, అమెరికా సైనిక ఉన్నతాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించే సమయంలో బైడెన్  భావోద్వేగానికి గురయ్యారు. సైనిక లాంఛనాలతో మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం డోవర్ వైమానిక దళ స్థావరంలో అమరుల కుటుంబాలతో సమావేశమైన బైడెన్ దంపతులు.. వారికి ధైర్యం చెప్పారు. మరణించిన సైనికులందరూ 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారేనని.. అందులో ఐదుగురు 20 ఏళ్లవారేనని పెంటగాన్ వెల్లడించింది.

బాంబు దాడులతో అఫ్గానిస్థాన్‌ దద్దరిల్లుతోంది. గత గురువారం కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రెండు చోట్ల జంట పేలుళ్లు ఘటనలో వందకు పైగా మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది కూడా మరణించారు. కాబుల్‌ విమానాశ్రయమే లక్ష్యంగా బాంబులు, రాకెట్ల దాడి సాగుతోంది. ఆదివారం రాకెట్‌ దాడిలో ఓ అఫ్గాన్‌ పౌరుడు, చిన్నారి మృతిచెందారు. సోమవారం ఉదయం సైతం ఇదే తరహా దాడి జరిగింది. పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు