లిబియాలోకలకలం..సముద్రం ఒడ్డున27 మృతదేహాలు..!

సముద్రం ఒడ్డుకు 27 మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు......

Published : 26 Dec 2021 23:45 IST

ట్రిపోలి: లిబియాలో సముద్రం ఒడ్డుకు 27 మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతులంతా ఐరోపాకు చెందిన వలసదారులేనని లిబియాకు చెందిన రెడ్​ క్రెసెంట్ సంస్థ వెల్లడించింది. ఖోమ్స్​ పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఈ మృతదేహాలు కనిపించాయి. మరో ముగ్గురిని సిబ్బంది రక్షించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రెడ్​ క్రెసెంట్​ సంస్థ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మధ్యధరా సముద్రంలో మృతదేహాలు తేలుతున్నట్లుగా ఆ ఫొటోల్లో కనిపించాయి.

మృతులంతా లిబియాలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వలసదారులేనని తెలుస్తోంది. లిబియా దేశ రాజధాని ట్రిపోలిలో వలసదారులపై అధికారులు అణచివేతను భరించలేక చాలామంది దేశం విడిచి ఐరోపాకు పడవల్లో అక్రమంగా వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో పడవ మునక ప్రమాదాల్లో అనేక మంది చనిపోతూ ఉంటారు. మధ్యధరా సముద్రంలో జరిగిన వివిధ పడవ ప్రమాదాల్లో ఈ ఏడాది దాదాపు 1,500 మంది వలసదారులు మృతి చెందారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన రెండు వేర్వేరు పడవ మునక ప్రమాదంలో 160 మంది వలసదారులు మరణించారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని