Salman khan: నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు.. బాంబే హైకోర్టులో సల్మాన్‌ ఖాన్‌ వాదనలు

తన ఫాంహౌస్‌కు పొరుగున ఉండే వ్యక్తి తన గురించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాడని ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అతడు పోస్ట్‌ చేస్తున్న వీడియోలు తన పరువుకు భంగం

Published : 13 Aug 2022 09:14 IST

అతడు వీడియోలను తొలగించేలా ఆదేశాలివ్వండి

ముంబయి: తన ఫాంహౌస్‌కు పొరుగున ఉండే వ్యక్తి తన గురించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాడని ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అతడు పోస్ట్‌ చేస్తున్న వీడియోలు తన పరువుకు భంగం కలిగించడంతోపాటు మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కేతన్‌ కక్కడ్‌ అనే ఆ వ్యక్తి తన గురించి పోస్ట్‌ చేసిన వీడియోలను తొలగించాలని సల్మాన్‌ గతంలో సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో సల్మాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సల్మాన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘పన్వేల్‌లోని సల్మాన్‌ ఫాంహౌస్‌కు పొరుగున ఉండే కేతన్‌ కక్కడ్‌.. ఆయన గురించి ఊహాజనిత అంశాలు ప్రచారం చేస్తున్నారు. గణేశుడి దేవాలయాన్ని ఆక్రమించి సల్మాన్‌ ఫాంహౌస్‌ను నిర్మించుకున్నారని, అక్కడ డ్రగ్స్‌, అవయవాల వ్యాపారం, బాలల అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వీడియోల్లో చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆ వీడియోలు ఉంటున్నాయి. వీటిని లక్షల మంది వీక్షించారు. వీక్షకులు పెట్టే కామెంట్లు సల్మాన్‌పై ద్వేషాన్ని పెంచుతున్నాయి. వాటిని తొలగించేలా ఆదేశాలివ్వండి’’ అని సల్మాన్‌ తరఫు న్యాయవాది విన్నవించారు. ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు