Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్‌ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ (Sunny Leone) పాల్గొనాల్సిన ఫ్యాషన్‌ షో వేదికకు సమీపంలో బాంబు పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది.

Published : 04 Feb 2023 13:31 IST

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur)లో శనివారం ఉదయం శక్తిమంతమైన బాంబు పేలుడు (Bomb Blast) సంభవించింది. రాజధాని ఇంఫాల్‌లో ఓ ఫ్యాషన్‌ షో జరుగుతున్న వేదికకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ఫ్యాషన్‌ షోలో బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ (Sunny Leone) ఆదివారం పాల్గొననుంది.

శనివారం తెల్లవారుజామున ఈ వేదికకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ బాంబు పేలుడు (Bomb Blast) జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. పేలింది ఐఈడీనా లేదా గ్రనేడా అన్నది ఇంకా స్పష్టం కాలేదని చెప్పారు. కాగా.. ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ తీవ్రవాద సంస్థ ప్రకటనలు చేయలేదని అధికారులు వెల్లడించారు.

మణిపూర్‌ ఖాదీ, చేనేత వస్త్రాలతో పాటు రాష్ట్ర పర్యాటకాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో హౌజ్‌ ఆఫ్ అలీ అనే సంస్థ ఈ ఫ్యాషన్‌ షో (fashion show) ఏర్పాటు చేసింది. ఇందులో సన్నీ లియోనీ ఆదివారం పాల్గొననున్నారు. అయితే ఈ ఫ్యాషన్‌ షోను కొన్ని అతివాద సంఘాలు నిషేధించాయి. అవే ఈ బాంబు పేలుడుకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు