Booster Dose: బూస్టర్‌ డోసు వ్యవధి ఇక 6 నెలలే

బూస్టర్‌ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ వ్యవధి తొమ్మిది నెలలుగా ఉంది.

Published : 07 Jul 2022 01:30 IST

దిల్లీ: బూస్టర్‌ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఈ వ్యవధి తొమ్మిది నెలలుగా ఉంది. దీంతో రెండో డోసు తీసుకున్న 6నెలలు పూర్తైన వారికి బూస్టర్‌ డోసును అందించనున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోన్న దృష్ట్యా కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, కొవిడ్‌ పోరులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రికాషనరీ డోసు పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కేంద్రాల్లోనే అందిస్తుండగా.. రెండో డోసు తీసుకున్న 9 నెలల గడువు పూర్తయిన వారికే పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసు వ్యవధిని తొమ్మిది నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని నిపుణుల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీనిపై సమీక్ష జరిపిన కేంద్ర ప్రభుత్వం ఈ గడువును 6 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని