మృతదేహాలను ఉంచేందుకు భవనాల నిర్మాణం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మృతదేహాలను ఖననం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రముఖ పట్టణమైన రియోడిజనేరోలో ఇప్పటికే ఉన్న ప్రజా శ్మశానవాటికలు పూర్తిగా నిండిపోవడంతో ఉన్నవాటిని మరింతగా విస్తరిస్తున్నారు....

Published : 18 Apr 2021 10:45 IST

రియోడిజనేరో: ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్.. మృతదేహాలను ఖననం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రముఖ పట్టణమైన రియోడిజనేరోలో ఇప్పటికే ఉన్న ప్రజా శ్మశానవాటికలు పూర్తిగా నిండిపోవడంతో ఉన్నవాటిని మరింతగా విస్తరిస్తున్నారు. శవపేటికలు పెట్టేందుకు అరలుగా ఎత్తయిన నిర్మాణాలను ఏర్పాటుచేశారు. మృతుల సంఖ్య పెరిగిపోయి అవి కూడా నిండిపోతుండటంతో మరిన్ని బ్లాక్‌లను నిర్మిస్తున్నారు. ఇన్నోమా శ్మశానవాటికలో ఈ భవనాల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొవిడ్‌ మృతదేహాలను ఖననం చేసేందుకు చాలా సమయం పడుతోందని అక్కడివారు పేర్కొంటున్నారు. శవపేటికలతో క్యూ కట్టాల్సి వస్తోందని తెలిపారు.

బ్రెజిల్‌లో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మహమ్మారితో ప్రతి రోజు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇప్పటివరకు 3.69 లక్షల మంది వ్యాధి సోకి మృతిచెందారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని