Viral video: కల్యాణమండపంలో వధువు పుషప్స్‌..

ముస్తాబవుతున్న పెళ్లి మండపం.. బాజాబాజంత్రిలు, బంధువర్గం పలకరింపులు, చిన్నపిల్లల ఆటలతో కోలాహలంగా మారిన ప్రాంగణం.. సందడీతో కళకళాడుతున్న వేదిక అంతా ఒక్కసారిగా నివ్వెర పోయింది. ఆ వధువు చేసిన పనికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. నూతన వధువు ఫిట్‌న

Published : 15 Apr 2022 01:28 IST

చండీగఢ్‌: ముస్తాబవుతున్న పెళ్లి మండపం.. బాజాబాజంత్రీలు, బంధువర్గం పలకరింపులు, చిన్నపిల్లల ఆటలతో ఉత్సాహంగా మారిన ప్రాంగణం.. సందడితో కళకళాడుతున్న వేదిక .. ఇంతలో వధువు ఆగమనం...అందరిని పలకరించిన అనంతరం నేలపై పుషప్స్‌ చేసి ఫిట్‌నెస్‌పై తనకున్న ఔత్సాహికతను పెళ్లి మండపంలో  చాటుకుంది. భారతీయుల పెళ్లి వేడుకల్లో రోజు కొత్త పోకడలు వస్తున్నాయి. వధువు, వరుడు కుటుంబాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాలు, నెటిజన్లలోనూ ఇలాంటి పంథాలు నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.   ట్రెండ్‌ను సెట్‌ చేస్తున్న వీటి కథ మొన్న బుల్లెటు బండెక్కి  అంటూ మొదలై నేడు పెళ్లి దుస్తుల్లో వధువు పుషప్స్‌ చేసేదాకా వచ్చింది. హరియాణాలోని గురుగ్రాం జిల్లాల్లో ఒక నూతన వధువు పెళ్లి దుస్తులు, బరువైన నగలను ధరించి కూడా అలవోకగా పుషప్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌గా మారింది.  ఫిట్‌నెస్‌ ఔత్సాహికులకు ఇంతకన్నా ప్రేరణ ఏముందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని