Selfie: సెల్ఫీ పిచ్చితో ప్రమాదం.. వాయిదా పడిన పెళ్లి
కేరళలోని ఓ ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకలు ఒక్క సెల్ఫీతో వాయిదా పడ్డాయి. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్.కుమార్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది.
కేరళలోని ఓ ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకలు ఒక్క సెల్ఫీతో వాయిదా పడ్డాయి. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్.కుమార్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 9న ఘనంగా వివాహాన్ని జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు తమ కుటుంబసభ్యులతో గురువారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. తర్వాత దగ్గర్లోనే ఉన్న క్వారీని చూడడానికి అందరూ వెళ్లారు. అదే సమయంలో విని కృష్ణన్, శాండ్ర క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. ఇద్దరూ సెల్ఫీ స్టిల్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే కాలుజారి ఒక్కసారిగా 120 అడుగుల లోతు ఉన్న ఆ లోయలో పడిపోయింది శాండ్ర. వెంటనే వరుడు కూడా ఆమెను కాపాడడానికి దూకేశాడు. అప్పటికే నీటిలో మునిగిపోతున్న శాండ్రను విని కృష్ణన్ కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సహాయక సిబ్బంది వచ్చి రక్షించారు. స్వల్పంగా గాయపడిన వీరిద్దరూ కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శుక్రవారం జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ
-
Movies News
Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ
-
Politics News
PM Modi: పేదలను మోసగించడమే కాంగ్రెస్ వ్యూహం: ప్రధాని మోదీ
-
Politics News
TDP: ఇసుకను అమ్ముకుంటానని జగన్ మేనిఫెస్టోలో చెప్పారా?: సోమిరెడ్డి
-
General News
Amaravati: లింగమనేని రమేష్ నివాసం జప్తు పిటిషన్‌పై జూన్ 2న తీర్పు
-
Politics News
Kishan reddy: రాజ్యాంగం ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన: కిషన్‌రెడ్డి