Army: మరికొన్ని రోజుల్లో ‘మేజర్‌ జనరల్‌’గా ప్రమోషన్‌.. అంతలోనే!

తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణితోపాటు 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో బ్రిగేడియర్‌ లఖ్విందర్‌ సింగ్‌ లిద్ధర్‌ ఒకరు. హరియాణాలోని పంచకులకు చెందిన లిద్ధర్‌ గత ఏడాది కాలంగా బిపిన్‌ రావత్‌ వ్యక్తిగత సిబ్బందిగా

Published : 09 Dec 2021 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణితోపాటు 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో బ్రిగేడియర్‌ లఖ్విందర్‌ సింగ్‌ లిద్ధర్‌ ఒకరు. హరియాణాలోని పంచకులకు చెందిన లిద్ధర్‌ గత ఏడాది కాలంగా బిపిన్‌ రావత్‌ వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయనకు పదోన్నతి లభించేది. సెకెండ్‌ జనరేషన్‌ ఆర్మీ అధికారిగా ఉన్న లిద్ధర్‌కు మేజర్‌ జనరల్‌గా పదోన్నతి కల్పించే ప్రక్రియ కొనసాగుతుండగానే దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని లిద్ధర్‌ సన్నిహితులు వెల్లడించారు. పదోన్నతి లభించగానే ఆయన బిపిన్‌ రావత్‌ సిబ్బంది నుంచి తప్పుకొని డివిజన్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించేవారని తెలిపారు. 

జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌లో విధులు నిర్వర్తించిన లిద్ధర్‌.. అంతకు ముందు రెజిమెంట్‌ రెండో బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. కజకిస్థాన్‌కు భారతదేశ తరఫు రక్షణ అధికారిగా పనిచేశారు లిద్ధర్‌కు ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా సైన్యంలో మంచి పేరుంది. దేశానికి చేసిన సేవలకు గానూ లిద్ధర్‌ సేన, విశిష్ఠ్‌ సేవా పతకాలు అందుకున్నారు. దేశంలో ఉన్న అత్యంత తెలివైన.. ధైర్యవంతులైన ఆర్మీ అధికారుల్లో బ్రిగేడియర్‌ లిద్ధర్‌ ఒకరు అని.. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ కొనియాడారు. ఈ ప్రమాదంలో తను ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయానని అన్నారు. లిద్ధర్‌.. రాథోడ్‌ కలిసి ఎన్‌డీఏలో శిక్షణ పొందారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరాటం చేశారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని