రాజీనామా చేస్తానన్న బ్రిజ్‌ భూషణ్‌.. ప్రధానికి ట్యాగ్‌ చేసిన ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) రెజ్లర్లకు తన మద్దతు కొనసాగిస్తున్నారు. WFI చీఫ్ బ్రిజ్‌ భూషణ్‌ను ఉద్దేశించి తాజాగా ఆమె కేంద్రంపై విమర్శలు చేశారు. 

Updated : 01 May 2023 18:13 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా స్టార్‌ రెజ్లర్లు గత కొద్దిరోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అయితే ఆయన రాజీనామా చేయాలని రెజ్లర్లు (Wrestlers) కోరుతున్నారు. అయితే ప్రధాని మోదీ, ఇతర అగ్రనేతలు కోరితే తాను రాజీనామా చేస్తానని బ్రిజ్‌ భూషణ్‌ అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. 

‘ప్రధాని అడిగితే నేను వెంటనే రాజీనామా  చేస్తా. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అడిగినా కూడా నేను పదవి నుంచి దిగిపోతా’ అని బ్రిజ్‌ భూషణ్ అన్నట్లు ఓ వార్త కథనం రాసుకొచ్చింది. దీనిని షేర్ చేస్తూ.. ప్రియాంక ప్రధానిని ట్యాగ్ చేశారు. ‘నరేంద్రమోదీ మరి ఆయన్ను అడగండి. అవును అని మీరు ఇచ్చే సమాధానం కోసం న్యాయం ఎదురుచూస్తోంది’ అని ఆమె పోస్టు పెట్టారు. 

గత కొద్దిరోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. అందులో ప్రియాంక (Priyanka Gandhi) కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం వారిని కలిసి ఓదార్చారు. ప్రభుత్వం వీరి ఆవేదనను వినకుండా బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని