Kabul mission: ఆగస్టు 31కల్లా కాబుల్‌ మిషన్‌ ముగిస్తాం!

తాలిబన్ల ఆక్రమణకు గురైన అఫ్గానిస్థాన్‌ నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం........

Published : 25 Aug 2021 16:08 IST

బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి వెల్లడి

లండన్‌: తాలిబన్ల ఆక్రమణకు గురైన అఫ్గానిస్థాన్‌ నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ నుంచి తమ పౌరులు, సామగ్రిని తరలింపు ఎప్పటికి పూర్తవుతుందో కచ్చితమైన సమయాన్ని తాను చెప్పలేకపోయినప్పటికీ ఆగస్టు 31కి మాత్రం కాబుల్‌ మిషన్‌ పూర్తవుతుందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్‌ రాబ్‌ స్పష్టంచేశారు. ఈ నెలాఖరు నాటికి తమ బలగాలను అక్కడి నుంచి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్టు చెప్పారు. తమ దేశ పౌరులు, సామగ్రిని కాబుల్‌ నుంచి ఉపసంహరించుకొనేందుకు తమ సైన్యానికి కొంత సమయం అవసరమైనప్పటికీ.. ఉన్న సమయాన్నే సమర్థంగా ఉపయోగించుకుంటామని రాబ్‌ తెలిపారు. కాబుల్‌ను తాలిబన్లు వశం చేసుకున్న రోజు (ఆగస్టు 15) నుంచి ఇప్పటిదాకా 9వేల మంది బ్రిటిష్‌ పౌరులు, ప్రమాదంలో ఉన్న అఫ్గాన్‌లను బ్రిటిష్‌ సైన్యం తరలించిందన్నారు. 

అఫ్గాన్‌ నుంచి తరలింపు ప్రక్రియను ఇంకొంత కాలం పొడిగించాలంటూ బ్రిటన్‌ సహా పలు మిత్ర దేశాలు ఒత్తిడి చేసినప్పటికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తిరస్కరించారు. ఈ నెలాఖరు నాటికి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. కాబుల్‌ విమానాశ్రయంలో ప్రజలను సురక్షితంగా తరలించేందుకు దాదాపు 6 వేల మంది అమెరికా బలగాలు పనిచేస్తున్నాయి. తమ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే పశ్చిమ దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ అమెరికా సహా పశ్చిమదేశాలకు డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని