Arvind Kejriwal: బ్రిటిషర్ల చేతిలో భారతీయ విద్యా వ్యవస్థ నాశనం: కేజ్రీవాల్
భారతీయ విద్యావ్యవస్థను బ్రిటిషర్లు నాశనం చేశారని దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉపాధి కల్పించే విద్య కోసం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
దిల్లీ: భారతీయ విద్యావ్యవస్థ (Indian education system)ను బ్రిటిషర్లు నాశనం చేశారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మండిపడ్డారు. ఈ విధానం భారతీయులను క్లర్కులుగా తయారు చేసేందుకే దోహదపడిందన్న ఆయన.. ఉద్యోగాల పొందేందుకు కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా తయారు కావాలని పిలుపునిచ్చారు. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (GGSIPU) తూర్పు దిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.
‘1830ల్లో బ్రిటిష్ ఉన్నతాధికారి లార్డ్ మెకాలే.. ఓ విద్యావ్యవస్థను రూపొందించారు. అది కేవలం క్లర్కులను తయారు చేసేందుకే ఉపయోగపడుతోంది. బ్రిటిషర్లు భారత విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఆ వ్యవస్థలో మనం మార్పులు తేలేదు. ఉపాధి కల్పించే విద్య కోసం ప్రయత్నం చేయాలి. డబ్బు లేకున్నా చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దే విధంగా పాఠశాల విద్యా వ్యవస్థను రూపొందించాం. ఇక నుంచి ఉన్నత విద్యపై మేం దృష్టిపెట్టాల్సి ఉంది’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లలో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్
-
‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్