రంజాన్‌ వేళ.. స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న బీఎస్‌ఎఫ్‌‌ జవాన్లు- పాక్‌ రేంజర్లు!

రంజాన్‌ పర్వదినం వేళ జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పాక్‌ రేంజర్లు మిఠాయిలు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు .....

Published : 03 May 2022 15:49 IST

జమ్మూ: రంజాన్‌ పర్వదినం వేళ జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పాక్‌ రేంజర్లు మిఠాయిలు పంచుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఈద్‌ సందర్భంగా సరిహద్దు బలగాలు, పాక్‌ రేంజర్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నట్టు బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు వెల్లడించారు. సాంబా, కథువా, ఆర్‌ఎస్‌ పురా, అఖ్నోర్‌ తదితర సరిహద్దు అవుట్‌ పోస్టుల వద్ద మిఠాయిలు పంచుకున్నట్టు తెలిపారు. తొలుత బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పాక్‌ రేంజర్లకు స్వీట్లు ఇచ్చి ఈద్‌ శుభాకాంక్షలు చెప్పగా.. ఆ తర్వాత వాళ్లూ మిఠాయిలు ఇచ్చారని వివరించారు. దేశ సరిహద్దుల్లో శత్రు సేనల దాడులను నియంత్రించడంతో పాటు శాంతియుత, సుహృద్భావ వాతావరణం సృష్టించడంలోనూ బీఎస్‌ఎఫ్‌ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇలాంటి చర్యలు ఇరు సైనిక బలగాల మధ్య శాంతియుత వాతావరణాన్ని, స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పేందుకు దోహదపడతాయని సంధు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని