Updated : 11 Feb 2022 16:57 IST

BSF: ఆరుగురు పాకిస్థానీల అరెస్టు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ నిన్నటి నుంచి చేపట్టిన ఆపరేషన్‌ సత్ఫలితాలు ఇస్తోంది. సర్‌ క్రీక్‌ ప్రాంతంలో నిన్న 11 ఖాళీ పాకిస్థానీ పడవలను గుర్తించిన వెంటనే బీఎస్‌ఎఫ్‌ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. క్రీక్‌ క్రొకడైల్‌ విభాగానికి చెందిన కమాండోలను వేర్వేరు ప్రదేశాల్లో ఎయిర్‌ డ్రాప్ చేసింది. ఈ క్రమంలో కమాండోలు భారత్‌లో నక్కిన ఆరుగురు పాకిస్థానీ మత్స్యకారులను అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది.

సాధారణ తనిఖీల్లో భాగంగా నిన్న ఒక డ్రోన్‌ కెమెరాను ప్రయోగించి ఆ ప్రాంతంలో తనిఖీలు చేయగా.. మొత్తం 11 పాకిస్థాన్‌ పడవలను గుర్తించారు. దీంతో ఈ పడవల ద్వారా పాక్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన వారి కోసం వేట ప్రారంభించారు. తాజాగా అదుపులోకి తీసుకొన్న వారిని విచారణ నిమిత్తం హెలికాప్టర్లలో తరలించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని