Updated : 28 Jun 2022 01:52 IST

Jammu: రెండు రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర.. సరిహద్దుల్లో చొరబాటుదారుడి హతం

శ్రీనగర్‌: మరో రెండు రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న వేళ.. కశ్మీర్‌లో చొరబాటు ప్రయత్నాలు కలకలం రేపాయి. ఈ క్రమంలోనే కశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఓ పాకిస్థానీ చొరబాటుదారుడిని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) మట్టుబెట్టింది. ‘ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్‌ 36 బెటాలియన్ జవాన్లు ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లోని బకర్‌పూర్ సరిహద్దు ఔట్‌పోస్ట్ సమీపంలో.. ఓ వ్యక్తి అనుమానాస్పద కదలికలు గుర్తించి అప్రమత్తమయ్యాయి. కంచె దాటి భారత భూభాగంలోకి చొరబడాలనుకున్న అతడిని వెంటనే ఆగిపోవాలని హెచ్చరించాయి. అతడు పెడచెవిన పెట్టడంతో.. కాల్చి హతమార్చారు. విచారణ నిమిత్తం పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది’ అని ఓ బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

మరో ఘటనలో.. జమ్మూ కశ్మీర్ పోలీసులు భద్రతాదళాలతో కలిసి సోమవారం లోయలోని దోడా జిల్లాలో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదిని ఫరీద్ అహ్మద్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి చైనా తయారీ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఓ వ్యక్తి నుంచి ఆయుధాలు అందుకున్నాడని, దోడాలో పోలీసులపై దాడి చేసే పనిలో ఉన్నాడని విచారణ సమయంలో అహ్మద్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని