Drone: మూడు పాక్‌ డ్రోన్లను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌

పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న మూడు డ్రోన్లను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం రాత్రి కూల్చేసింది.

Published : 20 May 2023 22:55 IST

జలంధర్‌: పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న మూడు డ్రోన్లను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం రాత్రి కూల్చేసింది. పంజాబ్‌ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గుండా అవి వేర్వేరు ప్రాంతాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. ఈ డ్రోన్లు అమృత్‌సర్‌ జిల్లాలోని ఉధర్‌ ధరివాల్‌, రత్తన్‌ఖుర్ద్‌ గ్రామాల పరిధిలో గుర్తించి కూల్చివేసినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. ఓ డ్రోన్‌ పాకిస్థాన్‌ భూ భాగంలో పడిపోయినట్లు వెల్లడించారు. ఒక డ్రోన్‌లో 2.6 కిలోల బరువున్న రెండు ప్యాకెట్లు కనిపించాయి. వాటిలోని పదార్థాన్ని హెరాయిన్‌గా అనుమానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని