Drone: పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పులతో వెనక్కి!

పంజాబ్‌లో మరోసారి డ్రోన్‌ సంచారం కలకలం సృష్టించింది. ఇటీవల ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లోని వాన్‌ బార్డర్‌ పోస్టుకు సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన సరిహద్దు భద్రతా బలగాలు(బీఎస్‌ఎఫ్) వెంటనే దాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌ వైపు నుంచి...

Published : 20 Dec 2021 23:31 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో మరోసారి డ్రోన్‌ సంచారం కలకలం సృష్టించింది. ఇటీవల ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లోని వాన్‌ బార్డర్‌ పోస్టుకు సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన సరిహద్దు భద్రతా బలగాలు(బీఎస్‌ఎఫ్) వెంటనే దాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్‌.. గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మన దేశ భూభాగంలోకి చొరబాటుకు యత్నించింది. అయితే బీఎస్‌ఎఫ్‌ వెంటనే అప్రమత్తమై కాల్పులు జరపడంతో.. ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు.

‘ఆదివారం అర్ధరాత్రి గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని కసోవాల్ బార్డర్‌ ఔట్‌పోస్ట్‌ సమీపంలో పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్ కనిపించింది. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది.. దానిపై 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్‌ పాక్‌ సరిహద్దు వైపు వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని అధికారులు తెలిపారు. మరోవైపు పంజాబ్‌లో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని డేరా బాబా నానక్ ప్రాంతంలో అక్రమంగా చొరబడిన ఓ పాకిస్థాన్ యువకుడు బీఎస్‌ఎఫ్‌కు పట్టుబడ్డాడు. అధికారులు అతని వద్ద నుంచి చరవాణి, పాక్‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని