
Bugatti : రూ.98 కోట్ల కారు విక్రయం..!
ఇంటర్నెట్‌డెస్క్: బుగాట్టీ అత్యంత ఖరీదైన కారును ఫ్రాన్స్‌లోని ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించింది. ‘లా వొయిటర్ నొయిర్’ పేరుతో నిర్మించిన ఈ కారును గురువారం కొనుగోలుదారుకు అందజేసింది. ఫ్రెంచిలో ‘లా వొయిటర్ నొయిర్’ అంటే నల్లటి కారు అని అర్థం. ఈ కారు ధర 13.4 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.98 కోట్లు. ఈ కారు తయారీ 65వేల ఇంజినీరింగ్ పనిగంటలు పట్టింది. ఈ కారులో క్వాడ్ టర్బోఛార్జిడ్ 8.0లీటర్‌ద డబ్ల్యూ16 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 1,479 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్‌ను చిరాన్ మోడల్ నుంచి తీసుకొన్నారు.
దీని జెట్‌బ్లాక్ కార్ లుక్స్ వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ కారు ఆరు ఎగ్జాస్ట్‌టిప్స్ ఉన్నాయి. కారు బాడీ మొత్తం కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. ఇక కారుపై వేసిన ప్రత్యేకమైన నల్లటి రంగు గాజును తలపిస్తుంటుంది. ఈ కారు ఇంటీరియర్‌ను మాత్రం బుగాట్టీ బయటకు తెలియనీయలేదు. ఈ కారును ఒక వ్యక్తి కోసం ప్రత్యేకంగా నిర్మించినట్లు బుగాట్టీ వెబ్‌సైట్లో పేర్కొంది. 2019 జెనీవా ఆటోషోలో ఈ కారును ప్రదర్శించారు.