Surat Building Collapse: కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

Updated : 06 Jul 2024 18:38 IST

గాంధీనగర్: గుజరాత్‌ (Gujarat)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌ పట్టణంలోని సచిన్‌ పాలీ ప్రాంతంలో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన (Surat Building Collapse)లో 15 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సహాయ బృందాలు.. శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. భవనం అప్పటికే శిథిలావస్థకు చేరుకుందని, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని