Bus Accident: ఘోర ప్రమాదం.. 40మందితో నదిలో పడిన బస్సు

మధ్యప్రదేశ్​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధార్‌ జిల్లా ఖాల్‌ఘాట్‌ వద్ద బస్సు అదుపుతప్పి నదిలో పడింది.

Updated : 19 Jul 2022 00:44 IST


ధార్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తోన్న ఓ బస్సు.. ధార్‌ జిల్లాలోని ఖాల్‌ఘాట్‌ ప్రాంతంలో నర్మదా నది వంతెనపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి నదిలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, స్థానిక యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా.. 15 మందిని కాపాడినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని