
Bus: గమ్యం లేని బస్సు ప్రయాణం.. నిద్రే లక్ష్యం!
ఇంటర్నెట్ డెస్క్: రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రి హాయిగా నిద్రకు ఉపక్రమించేస్తాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్‌లోని ఉలూ ట్రావెల్స్ అనే సంస్థ ‘స్లీపింగ్ బస్ టూర్’ పేరుతో వినూత్న సేవల్ని ప్రవేశపెట్టింది. ఇంట్లో పడకపై నిద్ర పట్టని వారు తమ బస్సులో ప్రయాణిస్తూ ఐదు గంటలపాటు నిద్రపోవచ్చని తెలిపింది. హాంకాంగ్ పరిధిలో తమ డబుల్ డెక్కర్ బస్ ఐదుగంటలపాటు 75కి.మీ మేర గమ్యం లేకుండా తిరుగుతుందని.. చివరకు ఎక్కిన చోటే దించేస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. టికెట్ ధర సీటు ఎంపికను బట్టి 13 డాలర్ల నుంచి 51 డాలర్ల వరకు ఉంటుందట. ప్రయాణికులకు కళ్లకు పెట్టుకునే మాస్క్, గూడీ బ్యాగ్, బయటి శబ్దాలు వినిపించకుండా చెవులకు ఇయర్ ప్లగ్స్‌ను ఇస్తారు. కాగా.. ప్రయాణికులు తమకు అనువుగా ఉండేలా రాత్రి వేసుకునే దుస్తులు, బ్లాంకెట్లు కూడా తెచ్చుకోవచ్చు. ఇటీవల ఈ సేవల్ని ప్రారంభించగా.. సీట్లన్ని నిండిపోయాయట. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఉలూ ట్రావెల్స్ ఈ సేవల్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.