Dual mode vehicle: రోడ్డుపై బస్సు..ట్రాక్‌ మీదకు వెళితే ట్రైన్‌

రోడ్డుపై బస్సు, ట్రాక్‌ మీదకు వెళితే ట్రైన్‌లా మారి ప్రయాణించే బస్సులు (బస్సు-రైలు)డ్యూయల్‌ మోడ్‌ వెహికల్‌ (డీఎంవీ) జపాన్‌లో పరుగులు పెడుతూ..

Published : 29 Dec 2021 01:36 IST

టోక్యో: రోడ్డుపై బస్సు, ట్రాక్‌ మీదకు వెళితే ట్రైన్‌లా మారి ప్రయాణించే బస్సులు (బస్సు-రైలు)డ్యూయల్‌ మోడ్‌ వెహికల్‌ (డీఎంవీ) జపాన్‌లో పరుగులు పెడుతూ ప్రయాణికులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. ఈ బస్సులు రోడ్డు, రైల్వే ట్రాక్‌లకు తగిన విధంగా మార్పుచెంది ప్రయాణిస్తాయి. బస్సు రోడ్డును వదలి రైల్వే ట్రాక్‌పై ప్రయాణించేటప్పడు ముందు టైర్లను కొద్దిగా పైకిలేపి స్టీల్‌ వీల్స్‌ ట్రాక్‌పై సెట్‌ అయి రైలులా బస్సు ప్రయాణిస్తుంది. ఈ డీఎంవీ వాహనాలు కైయో, జపాన్‌లలో ఈనెల 25నుంచి ప్రారంభమయ్యాయి.ఈ డీఎంవీ మినీబస్సులా ఉంటుంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సాధారణ రబ్బరు టైర్లపై, ట్రాక్‌లపై స్టీల్‌ వీల్స్‌ ద్వారా ప్రయాణిస్తాయి. కైయో వంటి చిన్న పట్టణాల్లో  ఈ డీఎంవీ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని డీఎంవీలను నిర్వహిస్తున్న ఆసా కోస్ట్‌ రైల్వే కంపెనీ సీఈవో తెలిపారు.
ప్రజా రవాణాలోఈ రైలు బస్సులు విజయవంతమవుతాయని భావిస్తున్నట్లు  తెలిపారు.21మంది ప్రయాణికులతో ట్రాక్‌లపై గంటకు 60కి.మీ వేగంతోనూ, రోడ్లపై గంటకు 100కి.మీ వేగంతోనూ ఈరైలు బస్సు ప్రయాణిస్తుందని వివరించారు. రోడ్లపై డీజిల్‌ ఇంధనంతో నడిచే ఈ బస్సులు వివిధ రంగుల్లో ప్రయాణిస్తాయని, దక్షిణ జపాన్‌లోని షికోకు ద్వీపం తీరం వెంబడి అనేక చిన్న పట్టణాలను కలుపుతూ ప్రయాణికులకు ఆకర్షణీయమైన సముద్రతీర సౌందర్యాన్ని అందిస్తాయని వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని