By-polls: ఏప్రిల్‌ 12న ఐదు చోట్ల ఉప ఎన్నికలు: ఈసీ

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ......

Published : 12 Mar 2022 22:15 IST

దిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒక లోక్‌సభ స్థానం, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్‌ 12న ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాదిలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఎన్నికలు ఎలక్టోరల్‌ కాలేజ్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీగా ఉన్న బాబుల్‌ సుప్రియో రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే, అదే రాష్ట్రంలోని బాలీగుంగే అసెంబ్లీ స్థానంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌, బిహార్‌లోని బోచహన్‌, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నార్త్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు ఏప్రిల్‌ 16న చేపట్టనున్నట్టు ఈసీ తెలిపింది. అయితే, ఈ ఐదు చోట్ల ఉప ఎన్నికలకు మార్చి 17న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని