Mask: కాలిఫోర్నియాలో మళ్లీ మాస్క్‌ తప్పనిసరి!

కొవిడ్ విజృంభణ కొనసాగుతుండటం, ఒమిక్రాన్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాస్క్‌ ధరించడం తప్పనిసరి .......

Published : 15 Dec 2021 01:46 IST

శాక్రమెంటో: కొవిడ్ విజృంభణ కొనసాగుతుండటం, ఒమిక్రాన్‌ కలవరపెడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాస్క్‌ ధరించడం తప్పనిసరి నిబంధనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఇండోర్‌లలో ఉన్న ప్రజలు మాస్క్‌లను ధరించాలని తాజాగా సూచించింది. డెల్టా రకం కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ కలకలంతో ఈ సెలవుల్లో ప్రజలు తమ కుటుంబాలు, స్నేహితుల్ని కలుసుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో మాస్క్‌ని తప్పనిసరి చేశారు. ఈ సరికొత్త నిబంధన బుధవారం నుంచి జనవరి 15వరకు కొనసాగుతుందని గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ కార్యాలయ అధికారులు వెల్లడించారు. రెండు వారాల వ్యవధిలోనే కాలిఫోర్నియాలో కొవిడ్‌ కేసులు 47శాతం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

‘ప్రజలు అలసిపోయారని, సాధారణ పరిస్థితుల కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారని మాకూ తెలుసు.. నిజం చెప్పాలంటే నాకూ అలానే ఉంది’ అని హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ సెక్రటరీ డాక్టర్‌ మార్క్‌ ఘాలే పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మన వద్ద ఉన్న ఆయుధం మాస్క్.. అదే పనిచేసింది.. పనిచేస్తుంది కూడా అన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మాస్క్‌ తప్పనిసరి నిబంధనను జూన్‌ 15న ప్రభుత్వం ఎత్తివేసింది. కానీ, అప్పట్నుంచి కొత్త వేరియంట్లతో కేసులు రెట్టింపు అవుతుండటంతో కౌంటీ ప్రభుత్వాలు స్థానికంగా నిబంధనలు అమలుపరుస్తూ వస్తున్నాయి. తాజా నిబంధన ప్రకారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రజలంతా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని మార్క్‌ ఘాలే విజ్ఞప్తి చేశారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని