California: కాలిఫోర్నియా భగభగా.. విస్తరిస్తున్న కార్చిచ్చు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో అతిపెద్ద కారుచిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున బుగ్గి చేసింది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో  దీని దెబ్బకు వేల ఎకరాలు అగ్నికి ఆహూతి అవుతున్నాయి.

Published : 25 Jul 2021 23:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో అతిపెద్ద కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున అడవులను ఇది బుగ్గి చేస్తోంది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో  దీని దెబ్బకు వేల ఎకరాలు అగ్నికి ఆహూతి అవుతున్నాయి. జులై 14వ తేదీన మొదలైన ది డిక్సీ ఫైర్‌ కూడా డజను ఇళ్లను తగలబెట్టింది. 73 వేల హెక్టార్లలో దీని పరిధిలోకి వచ్చాయి.  ఇక దేశంలోనే అతిపెద్దదైన దక్షిణ ఓరిగాన్‌లో బూట్లెగ్‌ ఫైర్‌ను అదుపు చేసేందుకు దాదాపు 2,200 మంది అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో కొంత వరకూ దీనిని అదుపులోకి తెచ్చినా.. వేల గృహాలకు ఇంకా ముప్పు పొంచి ఉంది. 

కాలిఫోర్నియాలో స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ..

కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ రాష్ట్రంలో స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఉత్తర కౌంటీల్లో పరిస్థితి పూర్తిగా దిగజారిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. 

ఇక కాలిఫోర్నియాలోని థోహ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో జులై నాలుగో తేదీన పిడుగుల కారణంగా మొదలైన ది టామ్‌రాక్‌ ఫైర్‌ కూడా ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది కాలిఫోర్నియా-నెవాడా రాష్ట్రాల్లో చాలా కమ్యూనిటీలకు ముప్పుగా పరిణమించింది. 

ఇక అమెరికాలో మొత్తం 85 చోట్ల కార్చిచ్చు వ్యాపించింది. ఇది మొత్తం 5,53,000 హెక్టార్ల భూములకు (14లక్షల ఎకరాలు) విస్తరించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని