ఎమ్మెల్యే తనయుడి లంచావతారం.. తీగలాగితే నోట్ల గుట్టలు..
లంచం తీసుకుంటూ కర్ణాటక(Karnataka) ఎమ్మెల్యే కుమారుడు లోకాయుక్త అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో పెద్దమొత్తంలో నగదును గుర్తించారు.
బెంగళూరు: ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక గుత్తేదారు నుంచి రూ.40 లక్షలు లంచం(Bribe) తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు భాజపా ఎమ్మెల్యే తనయుడు. ఇప్పుడు అతడి ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు భారీ సొమ్మును గుర్తించారు. సుమారు రూ.6 కోట్ల నోట్ల గుట్టలను గుర్తించినట్లు శుక్రవారం వెల్లడించారు.
కర్ణాటక (Karnataka)లోని దావణగెరె జిల్లా చెన్నగిరి శాసనసభ్యుడు మాడాళు విరూపాక్షప్ప (Virupakshappa) తనయుడు ప్రశాంత్ (Prashanth Madal). ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక గుత్తేదారు నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న ప్రశాంత్.. ఈ టెండరు విషయంలో రూ.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు లోకాయుక్త అధికారులకు ఉప్పందించడంతో.. వారు ప్రశాంత్ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడ లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న అధికారులు అతడి నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు.
మైసూర్ శాండల్ సబ్బు(Mysore Sandal Soap)ను తయారు చేసే ప్రభుత్వ ఆధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(KSDL)కు విరూపాక్షప్ప ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నిన్న ప్రశాంత్‌ను అధికారులు ఈ కేఎస్‌డీఎల్ కార్యాలయంలోనే అరెస్టు చేశారు. మూడు బ్యాగుల్లో రూ.1.7 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన ఇంట్లో రూ. 6 కోట్లు గుర్తించినట్లు చెప్పారు.
కర్ణాటక(Karnataka)లో భాజపా(BJP) అధికారంలో ఉంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎంతో సహా అక్కడి నేతలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఘటన భాజపాను ఇరకాటం పడేసేదే.
కేఎస్‌డీఎల్ పదవికి ఎమ్మెల్యే రాజీనామా..
కుమారుడు లంచం కేసులో చిక్కుకోవడంతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోయారు. కేఎస్‌డీఎల్ కార్యాలయంలోనే లంచం డబ్బును లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ భాజపా ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
FootBall in Asian Games: ఇలాగైతే మమ్మల్ని ఎక్కడికీ పంపొద్దు: భారత ఫుట్‌బాల్ కోచ్ ఆవేదన
-
KTR: వరి మాత్రమే సరిపోదు.. ఆయిల్‌పామ్ పండించాలి: కేటీఆర్
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..
-
Afghan embassy in India: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా? కేంద్రానికి మెసేజ్..!