Karti Chidambaram: వీసాలకు లంచం కేసు.. కార్తీ చిదంబరం సన్నిహితుడి అరెస్టు

చైనా జాతీయుల వీసాలకు అనుమతులు మంజూరు చేసే విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కార్తీ అత్యంత సన్నిహితుడైన ఎస్‌.

Published : 18 May 2022 10:53 IST

దిల్లీ: చైనా జాతీయుల వీసాలకు అనుమతులు మంజూరు చేసే విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కార్తీకి అత్యంత సన్నిహితుడైన ఎస్‌. భాస్కరరామన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని కార్తీ నివాసం, కార్యాలయాల్లో సీబీఐ నిన్న సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం భాస్కర రామన్‌ను ప్రశ్నించిన అధికారులు ఈ ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు.

పంజాబ్‌లోని ఓ పవర్‌ కంపెనీ పనుల నిమిత్తం చైనా నుంచి వచ్చిన 263 మందికి వీసాలను జారీ చేసేందుకు గానూ కార్తీ రూ.50లక్షలు తీసుకున్నట్లు సీబీఐ తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 2011లో యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్తీ తండ్రి పి. చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పంజాబ్‌లోని తలవండీ పవర్‌ ప్రాజెక్టు ప్రతినిధి వికాస్‌ మఖరియా.. తమ ప్రాజెక్టు పనుల్లో జాప్యం అవుతున్నందున చట్టపరమైన చర్యలను తప్పించుకునేందుకు చైనా నుంచి అదనపు సిబ్బందిని, నిపుణులను ఆ వీసాల సాయంతో రప్పించినట్లు సీబీఐ తెలిపింది. ఇందుకు గానూ ముఖరియా.. కార్తీ సన్నిహితుడైన భాస్కర్‌ను సంప్రదించగా అతడి ద్వారా ఈ వీసాలకు అనుమతులు పొందినట్లు పేర్కొంది. ఈ వీసా అనుమతుల కోసం కార్తీ రూ.50లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. పని పూర్తయిన తర్వాత మఖరియా ఈమెయిల్‌ ద్వారా కార్తీ, భాస్కర్‌ రామన్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు