CBI: రబ్రీ దేవీ ఇంటికి సీబీఐ.. మాజీ సీఎంను ప్రశ్నిస్తోన్న అధికారులు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు ప్రస్తుతం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ ఇంట్లో ఉన్నారు. Land For Job Caseలో ఆమెను సీబీఐ ప్రశ్నిస్తోంది.
పట్నా: బిహార్(Bihar) మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ(Rabri Devi)ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI) ప్రశ్నిస్తోంది. పట్నాలోని ఆమె నివాసంలో ఈ విచారణ జరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)లో సోమవారం సీబీఐ ఆమెను విచారిస్తోంది.
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA) హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబరు 7న లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రబ్రీ తనయులు బిహార్(Bihar) ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతేడాది భాజపాను వీడి ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా.. తేజ్ ప్రతాప్ యాదవ్ పర్యావరణ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ts-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!