CBI- ED: సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలం పొడిగింపు.. కేంద్రం ఆర్డినెన్స్‌

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీ కాలం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్రం రెండు వేర్వేరు ఆర్డినెన్సులను తీసుకొచ్చింది.

Published : 14 Nov 2021 19:03 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీ కాలం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్రం రెండు వేర్వేరు ఆర్డినెన్సులను తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ మేరకు ఆర్డినెన్సులపై సంతకం చేశారు. ప్రస్తుతం సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.

తాజాగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల ప్రకారం.. రెండేళ్ల పదవీ కాలం పూర్తయ్యాక ఏడాది చొప్పున మొత్తం ఐదేళ్ల వరకు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల తర్వాత పొడిగించడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఈడీ డైరెక్టర్‌ ఎస్‌కే మిశ్ర పదవీకాలం పొడిగింపు విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసాధారణ, అరుదైన సందర్భాల్లో మాత్రమే పదవీ కాలాన్ని పొడిగించాలని పేర్కొంది. వచ్చే వారం ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తికావొస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్సులు తీసుకురావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని