CBI Raids: రూ.820 కోట్ల IMPS లావాదేవీలు.. 13చోట్ల సీబీఐ సోదాలు

అనుమానాస్పద లావాదేవీలపై యూకో బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Updated : 05 Dec 2023 22:01 IST

దిల్లీ: గత నెలలో యూకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల మేర అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని 13 చోట్ల సోమవారం సోదాలు చేపట్టింది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కోల్‌కతా, మంగుళూరులలో సోమవారం అర్ధరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగించినట్లు తెలిపారు.  బ్యాంకులో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్‌ ఇంజినీర్లతో పాటు ఇతర గుర్తు తెలియని వ్యక్తులపై యూకో బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

దాదాపు రూ.820 కోట్లు తక్షణ చెల్లింపుల సేవలు (IMPS) అనుమానాస్పదంగా ఉన్నట్లు బ్యాంకు ఆరోపించినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 10 నుంచి 13 తేదీల మధ్య ఏడు ప్రైవేటు బ్యాంకుల్లోని 14వేల ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్‌ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41వేల ఖాతాదారులకు మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ సిస్టమ్స్‌, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్‌ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని