Karti Chidambaram: కార్తి చిదంబరాన్ని 8గంటలు ప్రశ్నించిన సీబీఐ

కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ రెండో రోజు ప్రశ్నించింది. వీసా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తి చిదంబరం.......

Published : 27 May 2022 23:39 IST

దిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ రెండో రోజు ప్రశ్నించింది. వీసా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తి చిదంబరం శుక్రవారం సైతం విచారణకు హాజరు కాగా సీబీఐ 8 గంటలపాటు ప్రశ్నించింది. కార్తి చిదంబరం ఉదయమే సీబీఐ కార్యాలయానికి చేరుకోగా.. కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో ఆయనపై దర్యాప్తు సంస్థ ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం. కాగా తాను ఎవరికీ అక్రమంగా వీసా సదుపాయం కల్పించలేదని కార్తి చిదంబరం చెప్పినట్లు తెలుస్తోంది.

సుమారు రూ.50లక్షలు తీసుకుని చైనాకు చెందిన 250 మందికి వీసాలు ఇప్పించారని కార్తిపై ఆరోపణ ఉన్నాయి. ఆయన తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగినట్లు సీబీఐ పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసుపై గురువారం కూడా కార్తిని సీబీఐ విచారించగా దర్యాప్తు సంస్థలు తనపై మోపే ప్రతి కేసూ బోగసేనని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని