CBI: దేశవ్యాప్తంగా 40చోట్ల సీబీఐ సోదాలు.. 10 మంది అరెస్టు!

దేశవ్యాప్తంగా దాదాపు 40 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దాడులు నిర్వహించారు. విదేశీ విరాళాల ....

Published : 11 May 2022 02:03 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దాడులు నిర్వహించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ -2010)లోని నిబంధనలు ఉల్లంఘించి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు క్లియరెన్స్‌ ఇచ్చారన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన సీబీఐ.. పలు కంపెనీలు, ఎన్జీవోలపై దాడులు జరిపింది. ఐదుగురు ప్రభుత్వ అధికారులతో పాటు మొత్తంగా పది మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా పలువురు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌, కోయంబత్తూరు, మైసూరు, దిల్లీ, రాజస్థాన్‌, చెన్నై తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపిన తర్వాత హవాలా మార్గాల ద్వారా రూ.2 కోట్లు మేర అక్రమ లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని సీబీఐ తెలిపింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాచారం మేరకే ఈ సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ నిధులు పొందేలా ఎన్జీవోలకు క్లియరెన్స్ ఇచ్చేందుకు లంచం తీసుకొంటుండగా హోం మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు, మధ్యవర్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని