యూజీసీ నెట్‌ పేపర్‌ లీక్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

యూజీసీ నెట్‌ పేపర్‌ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 20 Jun 2024 23:17 IST

దిల్లీ: యూజీసీ నెట్‌ పరీక్ష లీకేజీ కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత కోసం ఈ నెల 18న దేశ వ్యాప్తంగా యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 

అవును.. పరీక్షకు ముందురోజు రాత్రే నీట్ పేపర్‌ అందింది: అంగీకరించిన విద్యార్థులు

అయితే, ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షను 9లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. త్వరలోనే మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు