అనిల్‌ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ!

మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ....

Published : 24 Apr 2021 11:38 IST

ఆయన నివాసంలో సోదాలు

ముంబయి: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. ముంబయిలోని ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు శనివారం ఉదయం సోదాలు చేపట్టారు.

అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలపై శుక్రవారం నాటికి ప్రాథమిక విచారణ పూర్తయిందని అధికారులు తెలిపారు. దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. పోలీసు అధికారుల బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాలు పలువురు అధికారుల్ని విచారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు