CBI: ఆప్‌ ఎమ్మెల్యే ఇంట్లో సీబీఐ సోదాలు

పంజాబ్‌లోని ఆప్‌ ఎమ్మెల్యే జశ్వంత్‌ సింగ్ గజ్జన్‌ మజ్రా ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. రూ.40 కోట్ల.....

Published : 07 May 2022 22:40 IST

దిల్లీ: పంజాబ్‌లోని ఆప్‌ ఎమ్మెల్యే జశ్వంత్‌ సింగ్ గజ్జన్‌ మజ్రా ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. రూ.40 కోట్ల మేర బ్యాంకు మోసం ఆరోపణలతో నమోదైన కేసులో సంగ్రూర్‌లోని ఆయన ఇంటితో పాటు మరో మూడు చోట్ల దాడులు జరిపారు. అమర్‌గఢ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జశ్వంత్‌ సింగ్‌ గజ్జన్‌పై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా -లుధియానా శాఖ ఇచ్చిన ఫిర్యాదుకు కేసు నమోదు చేసిన అధికారులు.. సంగ్రూర్‌ జిల్లాలోని మాలేర్‌ కోట్ల ప్రాంతంలో ఎమ్మెల్యే పూర్వీకుల ఇంట్లోనూ సోదాలు జరిపినట్టు అధికారుల తెలిపారు. 

‘‘బ్యాంకును మోసగించిన కేసు విచారణలో భాగంగా ఈరోజు మలేర్‌ కోట్ల (పంజాబ్)తో పాటు మూడు ప్రదేశాలలో ప్రైవేట్ సంస్థలు, డైరెక్టర్లు/గ్యారంటర్లతో సహా నిందితులకు సంబంధించిన ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో రూ.16.57 లక్షల నగదు, 88 విదేశీ కరెన్సీ నోట్లు, కొన్ని ఆస్తి పత్రాలు, కొన్ని బ్యాంకు ఖాతాలు, నేరారోపణ దస్త్రాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు’’ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సీబీఐ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని