సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్షల తేదీలివే.. 

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది.  మే 4 నుంచి  జూన్‌ 11 వరకు ....

Updated : 02 Feb 2021 18:10 IST

దిల్లీ: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది.  మే 4 నుంచి  జూన్‌ 11 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో ప్రకటించారు. మే 4 నుంచి జూన్‌ 7వరకు జరిగే పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అలాగే, మే 4నుంచి జూన్‌ 11 వరకు జరిగే 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. తొలి షిఫ్ట్‌ ఉదయం 10.30గంటల నుంచి 1.30గంటల వరకు; రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30గంటల వరకు జరగనున్నాయి. మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు; జులై 15 నాటికి ఫలితాలు విడుదల చేయనున్నట్టు గతంలోనే కేంద్రమంత్రి ప్రకటించారు.  

సాధారణంగా అయితే, ఏటా ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరిలో..  రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. 2021లో బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

సీబీఎస్‌ఈ పదో తరగతి షెడ్యూల్‌..

12వ తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని