సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ ఎప్పుడో తెలుసా?   

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్‌ సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌ను......

Published : 28 Jan 2021 15:53 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్‌ సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 2న వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. అలాగే, విద్యార్థులకు చెందిన 40 ఏళ్ల రికార్డులను సీబీఎస్‌ఈ డిజిటిలైజ్‌ చేయనుందని గురువారం తెలిపారు. 

మరోవైపు, సీబీఎస్‌ఈ 10,12వ తరగతుల బోర్డు పరీక్షలను ఈ ఏడాది మే 4 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు డిసెంబర్‌ 31న మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 15న వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు. సాధారణంగా అయితే, ఏటా ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరిలో..  రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. 2021లో బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు స్పష్టంచేసింది.

ఇదీ చదవండి..

రూపాయికే పిల్లలకు ట్యూషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని