
Published : 21 Sep 2021 23:26 IST
CBSE: కొవిడ్‌తో అనాథలైన విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు: సీబీఎస్ఈ
దిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్ష, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు ఇచ్చింది. విద్యార్థులపై కొవిడ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2021-22 విద్యా సంవత్సరం కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేయకూడదని సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ ఆదేశించారు. 10, 12వ తరగతి పరీక్షల కోసం విద్యార్థుల జాబితాను సమర్పించే సమయంలో పాఠశాలలు ఆయా వివరాలను ధ్రువీకరించి నమోదు చేయాలని సూచించారు.
ఇవీ చదవండి
Tags :