- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ప్రయాణాల్లో మాస్క్ లేకుంటే ఇక చర్యలే
వాషింగ్టన్: కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికి పోతున్నప్పటికీ.. మాస్క్ ధరించే విషయంలో మాత్రం ఇప్పటివరకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వలేకపోయింది. మాస్క్ ధరించడంపై ట్రంప్‌నకు ఉన్న అనాసక్తే ఇందుకు ఓ కారణం కావచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్తగా బైడెన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం మాత్రం.. ఎన్నికల ముందు కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామని నొక్కి చెప్పింది. అన్నట్లుగానే చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రయాణ ప్రాంతాలు, ప్రజారవాణా, ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ముఖం, ముక్కు మూసి ఉండేలా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీచేసింది. లేకుంటే చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
‘తాజా ఆదేశాల ప్రకారం, విమానాలు, రైళ్లు, షిప్లు, బస్సులు, సబ్వేలలో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే. ఉబర్ వంటి ప్రైవేట్ టాక్సీల్లోనూ ఈ నిబంధనలు పాటించాల్సిందే. భోజనం చేసేటప్పుడు, నీరు తాగే సందర్భాలలో మాత్రమే వీటికి మినహాయింపు ఇవ్వనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా, శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది’ అని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు ధరించి ప్రయాణాలు చేవడం వల్ల సాధ్యమైనంత వరకు కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని సీడీసీ వెల్లడించింది.
మాస్కులు ధరించే విషయమై ఇప్పటికీ సీడీసీ అక్కడి ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉంది. కానీ, దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు మాత్రం ట్రంప్ ప్రభుత్వం వెనకడుగు వేయడంతో అవి అమల్లోకి రాలేదు. కానీ, కొత్తగా అధికారంలోకి వచ్చిన బైడెన్ తొలిరోజు నుంచే కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీడీసీ తాజాగా ప్రయాణాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
-
Politics News
Telangana News: కాంగ్రెస్‌లో మరో అసమ్మతి స్వరం.. పీసీసీ తీరుపై మర్రి శశిధర్‌రెడ్డి అసహనం
-
Sports News
ZIM vs IND : జింబాబ్వేతో జర జాగ్రత్త రాహుల్ భాయ్.. ఆదమరిస్తే ఓటమే!
-
Movies News
Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
-
Crime News
Chocolate: గోదాంలోకి చొరబడి చాక్లెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ధర రూ.17లక్షలు!
-
General News
Telangana News: వాసవి గ్రూప్ స్థిరాస్తి సంస్థపై ఐటీ దాడులు.. 40 బృందాలతో సోదాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..