వ్యాక్సిన్‌ తీసుకున్నవారు ప్రయాణించొచ్చు: సీడీసీ

అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్న వారు ఎటువంటి టెస్టులు, స్వీయ నిర్బంధం అవసరం లేకుండా

Published : 06 Apr 2021 01:38 IST

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్న వారు ఎటువంటి టెస్టులు, స్వీయ నిర్బంధం అవసరం లేకుండా అమెరికాలో పర్యటించవచ్చని పేర్కొంది. ఈ మేరకు సీడీఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రోషెల్‌ వాలెన్స్కీ వెల్లడించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నవారికి వైరస్‌ సంక్రమణ ముప్పు తక్కువగా ఉన్నందున, వారు ఎటువంటి కొవిడ్‌ పరీక్షలు చేసుకోకుండా అమెరికాలో పర్యటించవచ్చని తెలిపారు. కొవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించే వారు ప్రయాణం అనంతరం కూడా స్వీయ నిర్బంధంలో (క్వారంటైన్‌) ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఆయా గమ్యస్థానాలు నుంచి వచ్చేవారు, ఇక్కడి నుంచి వెళ్లేవారు మాత్రం స్థానిక ప్రభుత్వాలు అమలుచేస్తున్న మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ టెస్టు తదితర జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కాగా, కొవిడ్‌ టీకా తీసుకోని ప్రయాణికులు మాత్రం ప్రయాణానికి ఒకటి నుంచి మూడు రోజుల ముందుగా వైరస్‌ నిర్ధారణ పరీక్ష కచ్చితంగా చేసుకోవాలని వాలేన్స్కీ తెలిపారు. ప్రయాణం అనంతరం కూడా వారం పాటు క్వారంటైన్‌లో ఉంటూ మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. 

అయితే ప్రయాణాలు చేసేప్పుడు టీకాతో సంబంధం లేకుండా అందరూ ఫేస్‌ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరం కాని ప్రయాణాలకు మార్గదర్శకాలు సవరించలేదని రోషెల్‌ వాలెన్స్కీ తెలిపారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకోనివాళ్లు ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని