
Amist Shah: కొత్త విధానాల వల్లే దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది: అమిత్ షా
గాంధీనగర్: కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న విషయం తెలిసిందే. తిరిగి జనజీవనం సాధారణ స్థితికి వస్తున్నా.. ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ముందు ఉన్న ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలను రూపొందించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ప్రస్తుతం ఉన్న విధానాల్లోనూ సవరణలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే భారత్ ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకునేలా ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించింది. ఇందుకోసం అన్ని రంగాలపై అధ్యయనం చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’కు అడ్డంకిగా మారిన విధానాలను కేంద్రం మార్చివేసింది. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు దక్కనున్నాయి. ఇలా కొత్త విధానాల అమలు, పాత విధానాల్లో సవరణలు చేయడం వల్లే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది’’అని అమిత్‌షా తెలిపారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు ఆకలి బాధలు ఉండకూడదని ఉచితంగా 5కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారని అమిత్‌షా గుర్తు చేశారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.