Mamata Banerjee: ఈడీ, సీబీఐ వల్ల భాజపాకు ఓట్లు పడవు: మమతా బెనర్జీ

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల సాయంతో భాజాపా ఓట్లు రాబట్టలేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శించారు.

Published : 05 May 2023 15:27 IST

కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలు, భాజపా (BJP) పై పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు.  ఈడీ (ED), సీబీఐ (CBI) వంటి దర్యాప్తు సంస్థల సాయంతో వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో భాజపా (BJP) ఓట్లు రాబట్టలేదన్నారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని సంశేర్‌గంజ్‌లో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు (2024 Elections) జరగనున్న నేపథ్యంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముర్షిదాబాద్‌, మాల్దా జిల్లాల్లో ప్రధాన సమస్యగా ఉన్న గంగా నది కోత విషయమై కేంద్రప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఎటువంటి సహాయం అందలేదన్నారు. గంగా నది కోత వల్ల భూములు కోల్పోయిన వారికి భూపట్టాలు పంపిణీ చేశారు.

ఇదిలా ఉంటే.. బెంగాల్‌లో జాతీయ పౌర పట్టిక (NRC)ను అమలు చేయబోనని మరోసారి స్పష్టం చేశారు దీదీ. పౌరసత్వం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రజలందరూ తమ ఆధార్‌ కార్డును సకాలంలో, పది సంవత్సరాలకు ఒకసారైనా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని