Daam: ‘ దామ్’ మాల్‌వేర్‌తో జాగ్రత్త: కేంద్రం హెచ్చరికలు
‘దామ్’ మాల్‌వేర్‌తో ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మొబైల్ వినియోగదారులు జాగ్రత్త వహించాలని పేర్కొంది.
దిల్లీ: ఆండ్రాయిడ్ మాల్‌వేర్ ‘దామ్’ (daam)తో ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ మొబైల్ ఫోన్లలోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తుందని, కాల్ రికార్డులు, కాంటాక్టులు, హిస్టరీ, కెమెరా తదితరాలను తన అధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు మొబైల్ వినియోగదారులు జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని కోరింది. సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను కూడా బోల్తా కొట్టించి, అందుకు అనుగుణంగా రాన్‌సమ్‌వేర్‌ను డెవలప్ చేసుకునే సామర్థ్యం ఈ మాల్‌వేర్‌కు ఉందని ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు, ఫిషింగ్, హ్యాకింగ్‌ల నుంచి సైబర్ స్పేస్‌ను రక్షించేందుకు ఈ విభాగం కృషి చేస్తుంది.
ఒకసారి దామ్ మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మొబైల్ సెక్యూరిటీ వ్యవస్థను మభ్యపెడుతుంది. డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఒకసారి దాని ప్రయత్నం ఫలిస్తే చాలు ఫోన్‌లోని రీడింగ్ హిస్టరీ, బుక్‌మార్క్స్ తదితర కీలక సమాచారాన్ని దొంగలిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌ను నిలిపేస్తుంది. కాల్ డేటాను సైతం హ్యాక్ చేస్తుందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. సమాచారం మొత్తాన్ని తస్కరించిన తర్వాత దానిని ‘.enc’ ఫార్మాట్ ఎన్‌క్రిప్ట్ చేసుకొని, ఒరిజినల్ డేటాను డిలీట్ చేస్తుందని పేర్కొంది. దీని బారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద యూఆర్‌ఎల్స్‌ను క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా మెసేజ్ చేస్తే స్పందించవద్దని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Tahir: 44 ఏళ్ల వయసులోనూ తాహిర్ జోరు.. ధోని రికార్డు బద్దలు కొట్టి..
-
Trump: అమెరికాలో ఏదో జరగబోతోంది.. : జోబైడెన్ ఆందోళన
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
-
TCS: భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ