కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2019-2020 బోనస్‌ను ప్రకటించింది. ఈఏడాది బోనస్‌ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం తీపికబురు అందించింది...

Updated : 21 Oct 2020 18:40 IST

ఈ ఏడాది బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2019-2020 బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్‌ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం తీపికబురు అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో 30.67 లక్షల మందికి లాభం చేకూరనుంది. ప్రస్తుతం ప్రకటించిన బోనస్‌ విలువ రూ.3,737 కోట్లు అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. ఉత్పాదక, ఉత్పాదకేతర బోనస్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దసరా పండగకు ముందుగానే ప్రభుత్వం బోనస్‌ను ప్రకటించేది. అయితే ఈ ఏడాది పండగ దగ్గర పడుతున్నప్పటికీ బోనస్‌ ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. కొవిడ్‌ కారణంగా బోనస్‌ వస్తుందో, రాదో అనే అనుమానం నెలకొంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం బోనస్‌ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని