కరోనా కట్టడికి నేడు కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష 

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. మరోవైపు సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా కొవిడ్‌ కేసులు వెలుగుచూడటంతో ఈ చర్యలను మరింత వేగవంతం చేసింది...

Updated : 06 Apr 2021 01:00 IST

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కేంద్రం చర్యలు ముమ్మరంచేస్తోంది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. మరోవైపు, సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా కొవిడ్‌ కేసులు వెలుగుచూడటంతో ఈ చర్యలను మరింత వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మంగళవారం కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మరో 11 రాష్ట్రాలకు చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, దీని కట్టడికి అవలంబించాల్సిన కార్యచరణ, టీకా పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. 

మరోవైపు, భారత్‌లో తాజాగా లక్షకు పైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్‌ తరువాత కరోనా వ్యాప్తి మన దేశంలోనే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరి 8న అమెరికాలో 3 లక్షల కేసులు నమోదు కాగా, బ్రెజిల్‌లో మార్చి 25న లక్షపైగా కేసులు వెలుగు చూశాయి. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.91 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఏప్రిల్‌ 2 నుంచి 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ కేంద్రం టీకా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు