కేంద్రం పనితీరుకు రికవరీ రేటే సాక్ష్యం

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలకు దేశంలో పెరుగుతున్న రికవరీ రేటే సాక్ష్యమని  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమానికి జరై ఆయన మాట్లాడారు.

Published : 07 Oct 2020 23:35 IST

దిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలు ఫలితం ఇస్తున్నాయనడానికి దేశంలో పెరుగుతున్న రికవరీ రేటే సాక్ష్యమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘గత 9 నెలలుగా భారతదేశం కరోనా మహమ్మారిపై విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తోంది. కరోనాపై కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలు ఫలితం ఇస్తున్నాయనడానికి  దేశంలో పెరుగుతున్న రికవరీ రేటే సాక్ష్యం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పరీక్షల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 8 కోట్లు దాటింది. కరోనా పరీక్షలకు సంబంధించి జనవరి వరకు దేశంలో కేవలం ఒకే ప్రయోగశాల ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 1,889కి చేరింది. కరోనా వైరస్‌ టీకా కోసం జరుగుతున్న ప్రయోగాలపై నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. కొవిడ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో రాబోయే రోజుల్లో భారత్‌ మరిన్ని విజయాలు సాధిస్తుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 72వేల కరోనా కేసులు నమోదు కాగా.. 986 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 67 లక్షలకు చేరుకోగా.. వారిలో దాదాపు 57లక్షల మంది రికవరీ అయ్యారు. మరణించిన వారి సంఖ్య 1,04,555కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 82శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు