farmers protest: ‘వాళ్లు రైతులు కాదు ఆకతాయిలు’.. కేంద్రమంత్రి కామెంట్స్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆందోళన చేస్తోన్న వారు రైతులు కారని.. వాళ్లు ఆకతాయిలు, దుష్టులని సంబోధించారు...

Published : 22 Jul 2021 22:26 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న వారు రైతులు కారని.. వాళ్లు ఆకతాయిలు, దుష్టులని సంబోధించారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేస్తున్న రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ విధంగా స్పందించారు.

‘ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని రైతులని పిలువకూడదు. కుట్రదారుల చేతులు కలిపి వారు ఆటలు ఆడుతున్నారు. జంతర్‌మంతర్‌లో కూర్చొని ధర్నాలు చేసే సమయం రైతులకు ఉండదు. నిజమైన రైతులు వారి పంటపొలాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరవద్దనే ఉద్దేశంతో కొందరు మధ్యవర్తలు ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు’ అని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. జనవరి 26న రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ఉదహరిరిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని