CV Ananda Bose: కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌, డీసీపీపై వేటు..!

కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌, డీసీపీ ఇందిరా ముఖర్జీలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరు అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించడంతో ఈ చర్యలకు సిద్ధమైంది.

Published : 07 Jul 2024 20:37 IST

కోల్‌కతా: కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌, డీసీపీ ఇందిరా ముఖర్జీలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. పశ్చిమ బెంగాల్‌ (West Bengal) గవర్నర్‌ కార్యాలయంపై అవాస్తవాలను ప్రచారం చేయడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి.

సీపీ, డీసీపీలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని.. అందుకు గల కారణాలను వివరిస్తూ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ (CV Ananda Bose) కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో కలిసి అసెంబ్లీలో ప్రతిపక్ష (భాజపా) నేత సువేందు అధికారి తనను కలిసేందుకు వచ్చినప్పుడు పోలీసు సిబ్బంది వారిని అనుమతించలేదు. రాజ్‌భవన్‌లో పోలీసు సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌ ఆదేశాలను లెక్క చేయడం లేదని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

వారి ప్రవర్తన ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ నియమాలు, ప్రోటోకాల్‌ మాన్యువల్‌కు అనుగుణంగా లేవని గవర్నర్‌ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.. ఆ ఇద్దరు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని వినీత్‌ గోయల్‌, ఇందిరా ముఖర్జీలు పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు